కివీస్ పేసర్ల దెబ్బకు ఇండియా-ఎ కుదేల్.. 113 పరుగులకే ఆలౌట్!
Advertisement
- న్యూజిలాండ్-ఎతో తొలి టెస్టులో భారత్-ఎ ఘోర వైఫల్యం
- ఐదు వికెట్లతో చెలరేగిన కివీస్ పేసర్ సైమన్ కీన్
- ఒంటరి పోరాటం చేసిన యశ్ రాథోడ్
- కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, జురెల్, సుందర్ డకౌట్
Advertisement
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇండియా-ఎ జట్టుకు తొలి అనధికారిక టెస్టులో చేదు అనుభవం ఎదురైంది. కివీస్-ఎ పేసర్లు చెలరేగడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లింకన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎ కేవలం 39.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్-ఎ బౌలింగ్ ఎంచుకుంది. పచ్చికతో నిండిన పిచ్‌పై ఆ జట్టు పేసర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ (17), దేవదత్ పడిక్కల్ (32) కాసేపు ప్రతిఘటించినా, జాక్ గిబ్సన్ వారిని పెవిలియన్‌కు పంపడంతో భారత్ కష్టాల్లో పడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఒకరి వెనుక మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సాయి సుధర్శన్, కెప్టెన్ ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ డకౌట్‌గా వెనుదిరగడం భారత బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పట్టింది. ఈ దశలో యువ బ్యాటర్ యశ్ రాథోడ్ (44 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అతడి కీలక ఇన్నింగ్స్ వల్లే ఇండియా-ఎ జట్టు 100 పరుగుల మార్కును దాటగలిగింది.
కివీస్ బౌలర్లలో సైమన్ కీన్ అద్భుతంగా రాణించాడు. 11.3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత పతనంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి జాక్ గిబ్సన్ (3 వికెట్లు), ఫ్రేజర్ షీట్ (1 వికెట్) చక్కటి సహకారం అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్-ఎ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. ప్రధాన టెస్ట్ సిరీస్‌కు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఏర్పాటు చేసిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది.